ఏపీలో కొత్తగా 11,698 మందికి కరోనా పాజిటివ్..

156
covid 19
- Advertisement -

ఆంధ్రపదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కి పెరిగింది. 9,31,839 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 81,471 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,616కి చేరింది.

గడచిన 24 గంటల్లో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 37 మంది మృత్యువాత పడ్డారు.

- Advertisement -