మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మగధీర. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్,బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. సరిగ్గా 2009 జూలై 31న విడుదలైన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటిని తిరగరాసింది.
రామ్ చరణ్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడ్ ఎవర్‌గ్రీనే. రామ్‌చరణ్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. రామ్‌చరణ్ హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్‌చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ సినిమాకు హైలైట్. ఫిల్మ్ మేకింగ్‌లోనూ,బాక్సాఫీస్ వసూళ్లలోనూ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మగధీర దక్షిణాదిలో నెంబర్ 1 మూవీగా నిలిచింది.
సినిమా విడుదలై నేటికి 11 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ నాటి సంగతులని చిత్ర బృందంతో పాటు ఫ్యాన్స్ కూడా గుర్తు చేసుకుంటున్నారు. రియల్ స్టార్ శ్రీహరికి ట్రిబ్యూట్‌గా స్పెషల్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.