105 మినిట్స్..సెన్సార్ పూర్తి

19
- Advertisement -

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా 105 మినిట్స్. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్ కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.

ఇక తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. జనవరి 26న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా 105 మినిట్స్ సినిమా నిర్మించారు.

కో ప్రొడ్యూసర్ సుమన్ మాట్లాడుతూ… నిజంగా నిర్మాత బొమ్మక్ శివ కి ఎంతో గట్స్ ఉంటే గాని ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేయడం కష్టం. మా మాంక్ ఫిలిమ్స్ సంస్థ కూడా ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో డిస్ట్రిబ్యూషన్ థియేటరికల్ గా డిజిటల్ గా చేయాలని అనుకున్నామన్నారు.

Also Read:కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తేలేదు:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

- Advertisement -