ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారిని 58,184 మంది భక్తులు దర్శించుకోగా 16,122 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ రేపటి నుంచి నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్ఓ కౌంటర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. వీరికి ఈరోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేయనున్నారు.
ఇక తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీవాణి దాతలకు విమానాశ్రయం లో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచామని, బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేస్తారని వివరించారు. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..