ఆర్ఆర్ఆర్ @ 100 మిలియన్ వ్యూస్

37
rrr

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

కేవలం 6 గంటల 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుని 10 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇక తాజాగా విడుదలైన 6 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప ట్రైలర్ ప‌ది మిలియ‌న్ వ్యూస్ అందుకునేందుకు 16 గంటల టైం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్‌ ఫాస్టెస్ట్‌ 1 మిలియన్‌ లైక్డ్‌ ట్రయిలర్‌గా ఆల్‌టైమ్‌ రికార్డును సాధించింది.

RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | Jan 7th 2022