Imran Khan:ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

29
- Advertisement -

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం. అధికారిక రహస్య పత్రాలను బయట పెట్టిన కేసులో ఇమ్రాన్ తో పాటు మాజీ మంత్రి మహ్మద్ ఖురేషికి పదేళ్ల జైలు విక్ష విధించింది.

పాకిస్థాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియా జైలులో ఉన్నారు.

ప్రధానమంత్రి పదవీ నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభలో కొన్ని పత్రాలను చూపించారు. ఇవి తాను అమెరికాలోని పాక్ ఎంబసీ నుండి సేకరించానని చెప్పగా దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో ఇమ్రాన్‌తో పాటు ఖురేషిలను దోషులుగా తేల్చింది న్యాయస్థానం.

Also Read:ఈ క్రిమినల్ కేసుకు కారణం కొరటాలే

- Advertisement -