అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు..

255
modi
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.అగ్రవర్ణాల రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల ఇంటిస్థ‌లం, ఐదెక‌రాల పొలం ఉన్న వాళ్లు ఈ రిజ‌ర్వేష‌న్లకు అన‌ర్హులు. ఈ తాజా నిర్ణ‌యంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి.

లోక్‌సభ ముందుకు రేపు ఈబిల్లు రనుంది. ఈ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది.

- Advertisement -