10 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న’ఎన్టీఆర్’ ట్రైలర్..

274
NTR biopic
- Advertisement -

ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్‌ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక దీనిని ‘‘కథానాయకుడు, మహానాయకుడు’’ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు క్రిష్. చిత్రంలో రానా, సుమంత్, విద్యాబాలన్, రకుల్ ప్రీత్, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్‌పుత్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. చిత్ర విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

NTR biopic

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇదే వేదికపై ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కి ఇంతవరకూ 10 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ మూవీ నుండి రోజుకో గెటప్‌ను రివీల్‌ చేస్తుండగా.. తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు నుంచి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు.

కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ‘కథానాయకుడు’ .. ఫిబ్రవరి 7వ తేదీన ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.

- Advertisement -