మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ధన ప్రవాహం నడుస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంట్లోని ఓట్ల సంఖ్యను బట్టి కార్లు, బైక్లు, బంగారం ఇలా విచ్చలవిడిగా పంచుతున్నాయి పార్టీలు. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రజల మద్దతు కరువు కావడంతో ధన ప్రవాహానికి తెరలేపారు. దీంతో తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మునుగోడు ఉప ఎన్నికలు నిలవనున్నాయి.
నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయి. ఇక తాజాగా ఒక్కో కుటుంబానికి బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఇక లిక్కర్ సంగతి చెప్పనక్కర్లేదు. నియోజకవర్గంలో బీర్లు, బిర్యానీలు పొంగిపొర్లుతున్నాయి. ప్రతీ రోజు దసరానే అవుతోంది.
ఇక వలసల పర్వం కొనసాగుతోనే ఉంది. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేతలు తెల్లారే సరికి కండువా మారుస్తున్నారు. ముఖ్యంగా వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు వలసలను ప్రోత్సహిస్తుండటం వారి వారి స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.కోటి దాకా డబ్బులు ముట్టజెబుతున్నారు. ఏదిఏమైనా మునుగోడు ఉప ఎన్నికల పుణ్యమాని డబ్బుల ప్రవాహం నడుస్తుండగా….. ఛీ ఛీ రాజకీయాలు అనుకునేలా పరిస్థితి మారిపోయింది.