మరింత తగ్గిన బంగారం ధరలు..

59
gold

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ.43,750కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.47,730 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.1400 తగ్గి రూ.73,600కి చేరింది. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా, అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.