అద్భుత దృశ్యం…శ్రీశైలం 10 గేట్ల ఎత్తివేత

541
srisailam gates
- Advertisement -

ఎగువున వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో నిన్న డ్యామ్ నాలుగు గేట్లను ఎత్తివేశారు. గేట్లు తెరుచుకోగానే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీసింది.

ఇక ఇవాళ ఉదయం 10 గేట్లను ఎత్తివేశారు. ఈ అద్భుతమైన రమణీయ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సుందర దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు.

వీకెండ్స్ కావడంతో కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది.సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -