ఉద్యమనేతకు పచ్చని కానుక- మంత్రి పువ్వాడ

146
Minister Puvvada
- Advertisement -

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు జరుగనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు వినూత్న రీతిలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వహించనున్నారు. విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటనున్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్‌ పిలుపునిచ్చిన ‘కోటి వృక్షార్చన’ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలో మొక్కలు నాటనున్నారు. వీరితో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగనుంది.

ఖమ్మం జిల్లాలో 584 పంచాయతీలు ఉన్నాయి. వీటితో పాటు ఖమ్మం కార్పొరేషన్‌, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో దాదాపుగా 5,84,000 మొక్కలు సిధ్ధంగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. 481 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో 5,01,000 మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా అటవీశాఖ పరిధిలో 20 లక్షల మొక్కలు, భద్రాద్రి జిల్లా అటవీశాఖ పరిధిలో 28 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దాదాపు 80శాతం మొక్కలను కేసీఆర్‌ పుట్టిన రోజున నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఉద్యమనేతకు పచ్చని ఇది కానుక అని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు.

https://www.facebook.com/ItsPuvvadaAjayKumar/videos/238916561220797

- Advertisement -