- Advertisement -
సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీల ఆటగాళ్లు దుబాయ్‌కి చేరుకోగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ తీసుకొచ్చిన రూల్స్‌ని ఆటగాళ్లకు గుర్తుచేశారు విరాట్ కోహ్లీ. ఆటగాళ్లందరూ కరోనా రూల్స్‌ని ఫాలో అవ్వాలని తెలిపిన విరాట్… రూల్స్ అందరికీ వర్తిస్తాయి. ఇందులో మినహాయింపులు ఏమీ ఉండవన్నారు.
ఒక్క చిన్న తప్పిదం టోర్నీ మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఆ తప్పు ఆర్సీబీ టీమ్ నుంచి ఉండకూడదు. ప్రాక్టీస్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని తెలిపాడు విరాట్.
- Advertisement -