స్టార్‌ హీరో పై మనసుపడ్డ త్రిష

44
- Advertisement -

త్రిష… కుర్రాళ్ల కలల రాణి.. తన అందం, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన త్రిష తెలియనివారుండరు. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి… అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందంతో ఇంకా అవకాశాలను దక్కించుకుంటోంది త్రిష. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన `వర్షం`, `అతడు` వంటి సినిమాల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది.

ఇంకా చెప్పాలంటే త్రిష అందం మరింత పెరిగిందనే చెప్పాలి. చెక్కుచెదరని అందంతో త్రిష అప్‌ కమింగ్‌ హీరోయిన్లకు ఫోటీనిస్తుందనే చెప్పాలి. త్రిష అందం చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. తాజాగా త్రిష పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన మనసులో తీరని కోరికలుగా ఉన్న పలు అంశాలను ప్రేక్షకుల ముందు ఉంచింది త్రిష.

తాను ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో.. అటు కోలీవుడ్ లో సైతం అందరూ స్టార్‌ హీరోలతో నటించానని.. కానీ తనకు ఇప్పటి వరకు ఓ స్టార్‌ హీరోతో నటించే అవకాశం రాలేదంటూ త్రిష ఓ సీక్రెట్‌ బయటపెట్టింది. ఆయనతో కలిసి నటించాలని ఉందంటూ త్రిష తన కోరికను బయటపెట్టింది. ఆ స్టార్‌ హీరో రజనీకాంత్ కావడం విశేషం. రజనీకాంత్‌ తో తనకు నటించాలని ఉందంటూ త్రిష పేర్కొనడంతో ఆమె కోరిక నెరవేరాలని, త్వరలోనే ఆమె రజనీ పక్కన నటించాలని ఆమె ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. త్రిషకు రజనీ పక్కన నటించే ఛాన్స్‌ ఎప్పుడోస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి.. 

సాయిపల్లవి సింప్లిసిటీకి ఫిదా కావాల్సిందే..

విలన్‌ తో తమన్నా డేటింగ్‌?

రష్మి అందాలు అదరహో…

- Advertisement -