స్టార్ హీరోకు నో చెప్పిన ఫిదా భామ

549
Sai Pallavi
- Advertisement -

మ‌ల‌యాళ ప్రేమ‌మ్ లో మ‌ల్ల‌ర్ అనే పాత్ర‌లో న‌టించిన సాయి ప‌ల్ల‌వి ఫిదాలో తన నటనతో ఆడియ‌న్స్ ని ఫిదా చేసింది . ఫిదా హిట్ కావడం ఆమె కెరీర్ లో మంచి టర్నింగ్ పాయింట్ అయింది. ఫిదా తో సాయిపల్లవి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఈ అమ్మ‌డి డేట్స్ కోసం నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే నానితో ఏంసీఏ సినిమాలో నటిస్తోంది. దిల్‌ రాజు నిర్మాణంలో సాయి పల్లవి మూడు చిత్రాలను చేసేందుకు ఇప్పటికే కమిట్ అయింది.

తన రెండవ సినిమాకు 70 లక్షల పారితోషికాన్ని అందుకుంటున్న సాయి పల్లవికి తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు ఆఫర్‌ వచ్చిందట. కానీ ఆ ఆఫర్‌ను సాయి పల్లవి తిరస్కరించింది. ఆ సినిమాలో నటించినందుకు గాను ఈ అమ్మడికి నిర్మాత కోటి రూపాయల పారితోషికంను సైతం ఇచ్చేందుకు నిర్మాత ఓకే చెప్పాడు. కానీ సాయి పల్లవి మాత్రం ఆ హీరోతో నటించను అంటూ తేల్చి చెప్పింది. తనకు డబ్బు ముఖ్యం కాదని దిల్‌ రాజు నిర్మాణంలో మూడు సినిమాలు చేస్తానని తాను మాటిచ్చానని, ఆ సినిమాలు పూర్తి అయితే తప్ప మరే స్టార్‌ హీరోతో కానీ, ఏ నిర్మాతకు కానీ డేట్స్‌ ఇవ్వలేను అంటూ క్లారిటీగా చెప్పేసింది.

ఈ అమ్మ‌డి ధోర‌ణి ఆ హీరోని షాక్ అయ్యేలా చేసింద‌ట. మ‌రి ఇంత‌కు ఆ హీరో ఎవ‌రో తెలియ‌దు కాని ప్ర‌స్తుతం దీనిపై ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -