సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలుపు…

507
delhi vs kolkatha
- Advertisement -

టీ20లో అసలైన మజాను ఆస్వాదించారు క్రికెట్ లవర్స్‌. ఓ వైపు భారీ లక్ష్యం…లక్ష్యఛేదనలో ఢిల్లీ దూకుడు..కోల్‌కతాకు ఓటమి ఖాయమైంది అనుకుంటున్న తరుణంలో సీన్ రివర్స్. వెరసీ సూపర్ ఓవర్‌..ఢిల్లీ గ్రాండ్ విక్టరీ. ఇది శనివారం కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద జరిగిన మ్యాచ్‌ డిటైల్స్‌.

ఢిల్లీ విధించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. పృథ్వీషా(99; 55 బంతుల్లో 12×4, 3×6) ధాటికి లక్ష్యం చిన్నబోయింది. పృథ్వికి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (43; 32 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో ఢిల్లీ విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ చివర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ (2/41) ధాటికి ఢిల్లీ బ్యాట్స్‌ మెన్ తడబడడంతో మ్యాచ్‌ టై అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.

సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 10 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా 7 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ విజయ సంబరాల్లో మునిగిపోయింది.

అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి కోల్ కతా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 61 పరుగులకే 5 వికెట్లు కొల్పోయిన కోల్ కతా కనీసం 100 పరుగుల మార్క్‌ అయినా దాటుందా అన్న సందేహం. కానీ క్రీజులోకి వచ్చిన రసెల్ అద్భుతాన్ని చేశారు. కేవలం 28 బంతుల్లో 4 ఫోర్లు,6 సిక్స్‌లతో 62 పరుగులు చేశారు. భారీ షాట్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడ్డారు. రసెల్‌కు తోడు దినేష్ కార్తీక్ కూడా రాణించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 185 పరుగులు చేసింది.

- Advertisement -