మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు, తెలుగు సినిమాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి `మనమంతా`. రెండోది `జనతా గ్యారేజ్`. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ మరో తెలుగు సినిమా గురించి ప్రస్తావించారు. అయితే ఈ సారి ఆయన ప్రస్తావించిన చిత్రంలో ఆయన నటించలేదు. అయినా ఆ సినిమా గురించి, అందులోని నాయికను ఉద్దేశించి ప్రస్తావించడం విశేషం. మోహన్‌లాల్ ప్రస్తావించిన ఆ సినిమా పేరు `సిద్ధార్థ`. సాగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. బుల్లితెరపై తన స్టామినాని నిరూపించుకుని వెండితెర దశగా అడుగులు వేస్తున్న సాగర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది. దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని నాయికలు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ “మా సినిమా టీమ్‌ను, మా చిత్ర కథానాయిక రాగిణిని విష్ చేస్తూ మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ `ఆల్ ది బెస్ట్ రాగిణి ఫర్ యువర్ న్యూ తెలుగు మూవీ సిద్ధార్థ` అని ఆయన ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం ఆనందంగా ఉంది. మా `సిద్ధార్థ`కు సంబంధించి అన్ని పనులూ పూర్తయ్యాయి. ఈ నెల 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం“ అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ – విసు, రచనా సహకారం – రవిరెడ్డి మల్లు, కెమెరా – యస్.గోపాల్ రెడ్డి, సంగీతం – మణిశర్మ, సాహిత్యం – అనంత శ్రీరామ్, మాటలు – పరుచూరి బ్రదర్స్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఫైట్స్ – సాల్మాన్ రాజ్ (భాహుబలి ఫేం), ఆర్ట్ – బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ – హరీశ్ పాయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – ముత్యాల రమేశ్, సమర్పణ – లంకాల బుచ్చిరెడ్డి, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – దయానంద్ రెడ్డి.