ఆమె సంగీత ఆధ్యాత్మిక స్వరం తెలుగుజాతికి ఓ వరం. ఆమె పాడిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువారి గుండెల్లో భక్తిభావాలను ప్రసరింపచేస్తుంది. నిండైన భారతీయ సంస్కృతికి ఆ సుమధుర గాయని నిలువెత్తు నిదర్శనం. ఆమె ప్రముఖ గాయని ‘ఎం.ఎస్ సుబ్బులక్ష్మి’. నేడు ఆమె జయంతి…
భారత దేశమంటే ఒక గంగానది, ఒక హిమాలయం, ఓ సుబ్బులక్ష్మి అనిపించుకున్న ఆమె ప్రతిష్టాత్మక భారతర్నత పురస్కారాన్ని అందుకున్న తొలి గాయకురాలిగా చరత్రి సృష్టించిన మహోన్నత గాయని. ఈమె పూర్తి మధురై షుణ్ముకవడివు సుబ్బులక్ష్మి .
ఆధ్యాత్మిక స్వరధార ఎం.ఎస్ సుబ్బులక్ష్మి 1916 సెప్టంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించారు. ఎం.ఎస్ సుబ్బులక్ష్మి ఆదిగురువు ఆమె తల్లిగారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. 16ఏళ్ల వయస్సులోనే మ్యూజిక్ అకాడమి వేదికపై గళమెత్తిన సుబ్బులక్ష్మి తను జీవితంలో ఏనాడూ వెనుదిరిగి చూడలేదు. 1940లో గాంధేయవాది సదాశివంతో వివాహం జరిగింది. ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా సుబ్బులక్ష్మి చరిత్ర సృష్టించారు.
అన్నమయ్య, త్యాగయ్య, శ్యామశాస్త్రి, భక్తరామదాసు, క్షేత్రయ్యపదాలు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, విష్ణుసహస్రనామం, భజగోవిందం వంటి భక్తిగీతాలు- భజనలు ఆమె ఆలాపిస్తుంటే చెక్కిళ్ళపై కన్నీటితో తన్మయత్వంతో మంత్ర ముగ్ధుల య్యేవారు ఎందరో. తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర అనేక భాషలలో పాటలుపాడినా ప్రతిభాష తన మాతృభాష అన్నంత స్పష్టంగా కీర్తనలు చేసిన యం.యస్. బహుభాషా గాయని కావడం ఈ దేశంలోని సంగీతా భిమానుల అదృష్టం.
గాంధీజీ ప్రత్యేకంగా యం.యస్.చేత మీరా భజనలు పాడించుకున్నారు. ఆమె పాటలంటే గాంధీజీకి ఎంతోఇష్టం. ‘హరి తుమ్ హరో” అనే పాటను గాంధీజీ కోసం ప్రత్యేకంగా పాడి రికార్డు చేసింది. గాంధీజీ హత్యకు కొన్ని రోజుల ముందు యం.యస్. స్వయంగా పాడుతుంటే వినాలని ఆయన యం.యస్ కోసం కబురు పంపారట.
నేను మామూలు ప్రధాన మంత్రిని. ఆమె సంగీత సామ్రాజ్యానికి మహారాణి” అని పండిట్ నెహ్రు సుబ్బులక్ష్మిని ప్రస్తుతించారు. ఇలా సంగీత కచేరీలలో తనను తాను మరిచి భక్తిభావంతో యం.యస్. సుబ్బులక్ష్మి సంగీత కళావైదుష్యానికి ముగ్దులైన పెద్దలెందరో ఎన్నో విధాలుగా ప్రశంసించారు. దేశంలోని ఏడు విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్లు ప్రకటించి గౌరవించాయి. పద్మభూషణ్, పద్మవి భూషణ్ అవా ర్డులు అందజేసింది. అత్యంత ప్రతిష్టాకరమైన రామన్ మెగసెస్ అవార్డు కూడా అందుకు న్నారు. ఇలా ఎన్నో మరెన్నో అత్యు త్తమ పుర స్కారాలు ఆమె అందు కున్నారు. యం.యస్.కు ఆ పురస్కా రాలు, కచేరీల ద్వారా లభించిన సుమారు 3కోట్ల రూపాయలు విరాళాలుగా ఆమె పలుధార్మిక సంస్థలకు అందజేశారు.
1940 దశకంలో ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించారు. కొన్ని దశాబ్థాల పాటు తన గాత్రంలో పులకింప చేసిన సంగీత స్వరధార ఎం.ఎస్ సుబ్బులక్ష్మి2004, డిసెంబర్ 11న ఆనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కాని ఆమె గొంతు మాత్రం ఈ విశ్వం ఉన్నంత కాలం ప్రపంచమంతటా మారుమోగుతూనే ఉంటుంది.
భారత రత్న, సంగీత రాజ్ఞిగా యం. యస్. సుబ్బులక్ష్మి ఇంకా ఇలాగే రాబోయే రోజుల్లో కూడా తన సంగీత సుమధుర భక్తి కచేరీలతో రసజ్ఞులను తన్మయుల్ని చేయాలని కోరుకుందాం.