ఆకాష్ సహదేవ్, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎ.కె.యస్. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద అసోసియేట్ గా వర్క్ చేసిన ఎన్.నరసింహరావ్ దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `శరభ`. జయప్రద, నెపోలియన్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో హ్యుమన్ ఏమోషన్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ తో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కోటి మ్యూజిక్ డైరెక్షన్ కంపోజ్ చేసిన మాస్ బీట్ లో నిఖిత నర్తించనుంది. బాబా భాస్కర్ సినిమాకు నృత్య రీతులను సమకూరుస్తున్నారు.
రామోజీ ఫిలింసిటీలో జరగుతున్న ఈ సాంగ్ లో 50 మంది డ్యాన్సర్స్, 300 జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. క్వాలిటీ, మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అన్ కాంప్రమైజ్డ్ గా సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ తెలియజేశారు. సినిమా చాలా బాగా వస్తుంది. అన్నీ వర్గాలను అలరించే మంచి సినిమా అవుతుందని దర్శకుడు ఎన్.నరసింహారావ్ అన్నారు.
ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, జయప్రద, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి,రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్,ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.