‘విశ్వ‌క్‌’.. ఎన్ఆర్‌ఐ యూత్‌కు చ‌క్క‌టి సందేశం..

44
- Advertisement -

అజయ్ కతుర్వార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం విశ్వ‌క్. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బేన‌ర్‌పై తాటికొండ ఆనందం బాల కృష్ణ నిర్మించారు. వేణు ముల్కాకా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాగా, ఫిబ్ర‌వ‌రి 18న ఈ సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌శారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ ఆవ‌ర‌ణ‌లో విశ్వ‌క్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ, నాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అంటే ఇష్టం. కొత్త ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేదిశగా వున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఆదిశ‌గా తొలి అడుగువేస్తూ నాకు న‌చ్చిన పాయింట్‌ను ఎంచుకున్నాడు. కాలేజీ డేస్‌లో ఎన్‌.ఆర్‌.ఐ.లు విదేశాల‌కు వెళ్ళే టాపిక్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఇక్క‌డ‌నుంచి వెళ్ళిన‌వారు అక్క‌డ క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ ఇక్క‌డ మ‌నం ఏం కోల్పోతున్నామో అనేది అర్థ‌వంతంగా ఈ సినిమాలో చూపారు. ఇక సినిమాను అంద‌రూ న‌టించడం ఓ భాగ‌మైతే విడుద‌ల చేయ‌డం మ‌రింత క‌ష్టం. నిర్మాత‌కు స్నేహితులు చేయూతనిచ్చి బ‌య‌ట‌కు తేవ‌డం మంచి ప‌రిణామం. మీ లాంటి నిర్మాత‌లుంటేనే ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బంది వెలుగులోకి వ‌స్తారు. అందుకే విశ్వ‌క్ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు.

తెలంగాణ టీవీ సంఘం అధ్య‌క్షుడు, సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు నాగ‌బాల సురేష్ కుమార్ మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు వేణు మా చుట్టాల‌బ్బాయి. మాజీ ఫారెస్ట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రావు వేణును పంపారు. నా మాట విని త‌ను పి.జి. చేశాక వ‌చ్చాడు. సినిమారంగంలో సాధ‌క‌బాధ‌లు వివ‌రించాను. చిత్త‌శుద్ది వుంటే సక్సెస్ అదే వ‌స్తుంద‌ని న‌మ్మేవాడిని. అదే ఆయ‌న‌కు చెప్పాను. త‌ను నా ద‌గ్గ‌ర కొద్దికాలం ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత ఇంగ్లీషులో ఓ బుక్ రాసి విడుద‌ల చేశాడు. ఇక ఈ సినిమాను నిర్మాత చాలా ధైర్యంగా తీశాడ‌నే చెప్పాలి. మ‌న‌కు హీరోలు కొర‌త వుంది. అది చిత్ర హీరో అజ‌య్ లాంటివారు తీరుస్తార‌ని న‌మ్ముతున్నాన‌ని` తెలిపారు.

ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు మాట్లాడుతూ, వేణు న‌న్ను మా మొద‌టి సినిమాకు రావాల‌ని ఆహ్వానించాడు. నాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కులు అంటే ఇష్టం. వారిద్ద‌రూ వుంటూనే సినిమా అనే మూడ‌క్ష‌రాలు మొద‌ల‌వుతాయి. ర‌చ‌యిత 56 అక్ష‌రాల‌తో మేజిక్ చేస్తే, ద‌ర్శ‌కుడు మెద‌డుకు ప‌దును పెడ‌తాడు. ఈ ట్రైల‌ర్ చూశాను. నాకు బాగా న‌చ్చింది. ఇది విడుల‌య్యాక ద‌ర్శ‌కుడు వేణును ఎన్.ఆర్‌.ఐ.లు ఏంమ‌టారో చూడాలనుంది. చిత్ర హీరోకు మంచి భ‌విష్య‌త్ వుంది అని తెలిపారు.

చిత్ర నిర్మాత ఆనందం బాలకృష్ణ మాట్లాడుతూ, వేణు, నేను మంచి స్నేహితులం. మ‌న‌ల్ని జీవితంలో ఒక‌రు క‌లుస్తున్నారంటే ఏదో ప‌ర్‌ప‌స్ వుంటుంద‌ని పెద్ద‌లు అనేవారు. వేణుతో నా జ‌ర్నీ అలా వుందేమో సినిమా వ‌ర‌కు వ‌చ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంగీత ద‌ర్శ‌కుడు స‌త్య‌సాగ‌ర్ ధైర్యం చెప్పారు. ఆయ‌న సంగీతం బాగా స‌మ‌కూర్చారు. సాహిత్యం కూడా చ‌క్క‌గా కుదిరింది. ఇది అద్భుత‌మైన సినిమా అని చెప్ప‌గ‌లం అని తెలిపారు.

చిత్ర క‌థానాయ‌కుడు అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ, ఇందులో ఐదు పాట‌లున్నాయి. గీత ర‌చ‌యిత ఎంతో ప్రాణం పెట్టి రాశారు. అర్థ‌వంతంగా వున్నాయి. ఎన్‌.ఆర్‌.ఐ.ల‌ను ఆలోచింప‌జేసేవిగా అనిపిస్తాయి. ప్ర‌దీప్ కెమెరా అద్భుతంగా వ‌చ్చింది. నాకు మొద‌టి సినిమాకు మంచి నిర్మాత ల‌భించారు. ద‌ర్శ‌కుడు మాలోని టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీశారు. ఇక సెన్సార్ వారు చూసి ఎంతో మెచ్చుకున్నారు. ట్రైల‌ర్‌లో గ‌ట్టిగా చెప్పిన‌ట్లే ప్రేక్ష‌కులు గ‌ట్టిగా ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

ద‌ర్శ‌కుడు వేణు మాట్లాడుతూ, కొమ‌రంభీం జిల్లా చీర‌ప‌ల్లి మా ఊరు. ప్రీ రిలీజ్ వేడుక అక్క‌డివారికి చెప్ప‌లేక‌పోయాను. విశ్వ‌క్ సినిమాను నిర్మాత‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నా. ర‌చ‌యిత రాము బాగా మాట‌లు రాశాడు. ఈ సినిమా సిటీలోనేకాదు విలేజ్ లో కూడా ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఇప్ప‌టికే మా ఊరిలో థియేట‌ర్‌లో రెండురోజుల‌పాటు టిక్క‌ట్లు ఫుల్ అయ్యాయి. ఈనెల 18 విడుద‌ల‌వుతున్న సినిమాను అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాని తెలిపారు.

బిగ్ బాస్ విశ్వ మాట్లాడుతూ, నాకు ఈ చిత్ర క‌థ న‌చ్చింది. నాకూ బ‌య‌ట‌కు వెల్ళాల‌ని లేదు. అందుకే ఇక్క‌డే వుండి పేరు తెచ్చుకుంటున్నా. ఇందులో రాప్‌ సాంగ్‌ను గాయ‌కులు చ‌క్క‌గా పాడారు.

నిరుప‌మ మాట్లాడుతూ, నాకు ఐలాగ్స్‌లు బాగా న‌చ్చాయి. ఏదో సాధించాల‌నే త‌ప‌న ఈ క‌థ‌లో క‌నిపించింది. హీరోనుచూస్తుంటే మ‌రో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌లా అనిపిస్తున్నాడు అని చెప్పారు.

- Advertisement -