విశాఖలో ప్రారంభమైన “కళామందిర్”

170
kalamandir
kalamandir
- Advertisement -

“లేట్ గా వచ్చినా లేస్టెస్ట్ గా వస్తా” అనే రజనీకాంత్ డైలాగ్ ను గుర్తుచేస్తూ.. అప్పటికే వస్త్ర ప్రపంచంలో ఉన్న మహామహులకు గట్టి పోటీనిస్తూ నేడు ఆ బిజినెస్ లో మకుటం లేని రారాజుగా మారిన ప్రఖ్యాత వస్త్రాభరణాల షోరూమ్ కళామందిర్ “ఇంతింతై వటుడింతై” అన్న చందాన శిఖరాగ్ర స్థాయికి చేరుకొంది.

kalamandir

నేడు (సెప్టెంబర్ 25) వారి బిజినెస్ చైన్ లో మరో కలికితురాయి అయిన “25వ షోరూమ్”ను విశాఖ మహానగరంలో అత్యంత ఘనంగా.. రాజకీయ, క్రీడ మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.

kalamandir

విశాఖపట్నంలోని అసిల్ మెట్టలో అధునాతనమైన, సుందరమైన కళామందిర్ 25వ షోరూమ్ ప్రారంభోత్సవానికి 2016 ఒలిపింక్స్ లో టెన్నిస్ లో వెండి పతాకం సాధించి తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసిన పి.వి.సింధు, రాష్ట్ర మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, తెలుగు చిత్రసీమలో ప్రముఖ కథానాయికలైన నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రగ్యా జైస్వాల్, నివేదా థామస్ లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.
పి.వి.సింధు-గంటా శ్రీనివాసరావుల చేతుల మీదుగా షోరూమ్ ప్రారంభమవ్వగా.. నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రగ్యా జైస్వాల్, నివేదా థామస్ లు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు.

kalamandir

kalamandir

kalamandir

ఇప్పటివరకూ తెలంగాణ రాజధాని అయిన హైద్రాబాద్, ఆంధ్ర రాజధాని అయిన విజయవాడల్లో తమ షోరూమ్ లను సమర్ధవంతంగా నిర్వహిస్తూ అతివలకు అత్యంత ప్రియమైన చీరలను ఇంకాస్త అందంగా రూపొందించి వారి మనసుల్లో ఎనలేని సంతోషాన్ని నింపుతున్న కళామందిర్ గ్రూప్ ఎం.డి కళామందిర్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖపట్నంలోనూ తన వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించి త్వరలోనే ఇక్కడ కూడా తనదైన పనితనంతో అగ్ర స్థానానికి చేరుకోవాలన్న కళ్యాణ్ కళాతృష్ణ త్వరలోనే నెరవేరుతుందని వేడుకకు హాజరైన అతిధులు అభిలషించగా.. వేలాదిగా విచ్చేసిన జనాలు మనస్ఫూర్తిగా దీవించారు!

- Advertisement -