విలన్..మీనన్ !

551
Gautham menon as villian
Gautham menon as villian
- Advertisement -

ప్రేమకథల కు పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ . ఘర్షణ, ఏమాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న మీనన్‌.. ఇప్పుడు వెండితెరపై కనిపించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

gauthammenen

తమిళ దర్శకుడు అజయ్ జ్ఙాన ముత్తు తన సినిమాలో విలన్ పాత్రలో చేయమని కలిశాడట. ప్రస్తుతం ధనుష్ సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్‌ మీనన్ ఏ నిర్ణయం తీసుకోలేదని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అతర్వా, నయనతార లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా, గౌతమ్ మీనన్ అక్కినేని నాగచైతన్యతో సాహసమే స్వాసగా సాగిపో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -