కరోనా లాక్ డౌన్ సమయంలో అవసరంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం విజయ్ దేవరకొండ, దేవరకొండ ఫౌండేషన్ పేరు మీద సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు.విజయ్ దేవరకొండపై కొన్ని వెబ్ సైట్లు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ విజయ్ ఒక వీడియోను విడుదల చేశారు. తమ స్వంత అజెండాతో ఆరోపణలు చేసే ఇలాంటి తప్పుడు వార్తలను,గాసిప్ వెబ్ సైట్లను నమ్మొద్దని,వాటికి దూరంగా ఉండాలని వీడియోలో తెలిపారు.
విజయ్ దేవరకొండ పిలుపుకు స్పందించిన సూపర్ స్టార్ మహేష్,ఈ విషయంలో విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సంవత్సరాల కృషి,కష్టం, ఓర్పు,ఎన్నో త్యాగాలు ఉంటాయి.అంత కష్టపడితే కానీ ప్రజాభిమానం పొందలేము. భార్యకు బాధ్యత గల భర్తగా,పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఒక సూపర్ హీరో వంటి తండ్రిగా, ఎంతగానో ప్రేమించే అభిమానులకు ఆదర్శవంతమైన సూపర్ స్టార్‌గా బాధ్యత నిర్వర్తించాలంటే ఎంతో నిబద్ధతతో పని చేయాలి.
ఎవరో పేరు కూడా తెలియని వ్యక్తి డబ్బు కోసం అగౌరవపరిచేలా, నిరాధార వార్తలు రాసి ఆ అబద్ధాలను వాటిని చదివే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీనీ,నా ఫ్యాన్స్ ను,నా పిల్లలను ఈ అబద్ధపు వార్తల నుండి కాపాడుకోవాలనుకుంటున్నాను. ఈ ఫేక్ వెబ్ సైట్ల మీద చర్యలు తీసుకోవాలని కలిసికట్టుగా వీటిని అరికట్టాలని, ఇందు కోసం అందరం ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను అని మహేష్ పేర్కొన్నారు.మహేష్ మద్దతుకు విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపి మనమంతా ఒకటే…ఈ అసత్య వార్తలను ఎదుర్కునే టైమ్ వచ్చింది అన్నారు.
I stand by you brother @TheDeverakonda #KillFakeNews #KillGossipWebsites https://t.co/mk5enwj5Pm pic.twitter.com/ESYodVIQbw
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2020
Thank you @urstrulyMahesh sir 🤗
We stand together 💪🏼🤘🏼
It's time. #KillFakeNews #KillGossipWebsites https://t.co/Ib3KK051Iz— Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2020