‘వానవిల్లు’ ట్రైలర్‌

278
- Advertisement -

రాహుల్‌ ప్రేమ్‌ (ఆర్పీ) మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్ర ట్రైలర్‌ని హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడైన ప్రతీక్‌ మాట్లాడుతూ…నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ డైరెక్ట్‌ చేశాను. నాకున్న ఇంట్రెస్ట్‌, టాలెంట్‌ చూసి మానాన్న గారు నన్ను ఎంతగానో ఎంకరైజ్‌ చేశారు.అంతేకాదు, నా మీద నమ్మకంతో ఈ మూవీని ప్రొడ్యూస్‌ కూడా చేశారు. ఈ సినిమాతో మా నాన్నగారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను…అని అన్నారు.

హీరోయిన్‌ శ్రావ్య మాట్లాడుతూ..ఈ సినిమా కథ చాలా బాగుంది. నేను కన్నడలో 4 సినిమాలు చేశాను. ఈ సినిమా కథ ఎంతగానో నచ్చడంతో..ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ధన్యవాదాలు అని అన్నారు. కెమెరామెన్‌ ఎస్‌.డి. జాన్‌ మాట్లాడుతూ..డైరెక్టర్‌, హీరో అయిన ప్రతీక్‌ వయసు 20 సంవత్సరాలుంటుంది. 20 సంవత్సరాల కుర్రాడు..ఇతనేం డైరెక్ట్‌ చేస్తాడని ముందు అనుకున్నా..కానీ..అతని డెడికేషన్‌కి, సినిమాపై అతనికున్న క్లారిటీకి ముగ్ధుడినయ్యాను…అన్నారు.

vaanavillu

నిర్మాత లంకా కరుణాకర్‌ దాస్‌ మాట్లాడుతూ…మా అబ్బాయి ప్రతీక్‌ గురించి చెబితే కొంచెం అతిశయోక్తిగా ఉంటుంది. కానీ అతనికున్న టాలెంట్‌కి, ఫ్యాషన్‌ని చూసి..ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. ఈ సినిమాని చాలా చక్కగా తెరకెక్కించాడు. కేరళ, మలేషియా, అరకు, హైద్రాబాద్‌ మొదలగు ప్రదేశాల్లో ఖర్చుకు వెనకాడకుండా..ఒక విజువల్‌ వండర్‌లాగా చిత్రాన్ని నిర్మించాము. ట్రైలర్‌ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము…అని అన్నారు.

ప్రతీక్‌ప్రేమ్‌కరణ్‌, శ్రావ్య, విశాఖ, హేమ, ప్రభాస్‌ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్‌, డైలాగ్స్‌: పవన్‌, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: సుబ్బారావు, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: సుభాష్‌, నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: జై, మూర్తి, కెమెరామెన్‌: ఎస్‌.డి. జాన్‌, నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌, కథ-స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్‌-దర్శకత్వం: ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌.

- Advertisement -