ఎన్నారై టి .ఆర్ .యస్ మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు సమస్త కార్యవర్గ సభ్యులు ,ప్రవాస తెలంగాణ వాదులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ,రెండు నిమిషాలు మౌనం పాటించి ,జోహార్ జయశంకర్ సార్ …జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు.
ఎన్నారై టి .ఆర్ .యస్ అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని ,వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని ,నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ గా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. అనుకున్న ఆశయ సాధనకై వారు చేసిన కృషి ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు .
అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు .
ఎన్నారై టి .ఆర్ .యస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ జయశంకర్ గారి జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని ,ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ …. సందర్భం ఏదైనా మనమంతా కెసిఆర్ గారి వెంట వుండి ,జయశంకర్ గారి ఆశయాల కోసం కృషి చెయ్యాలని ,ఇదే మనం వారికి ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి,శ్రీకాంత్ పెద్దిరాజు ,ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి ,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి ,నవీన్ మాదిరెడ్డి , ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి ,సత్య చిలుముల ,రవి ప్రదీప్,నవీన్ భువనగిరి,తదితరులు హాజరైన వారిలో వున్నారు .