రాష్ట్రంలోని ప్రతి చెరువును నీటితో నింపుతాం

571
harishrao
- Advertisement -

రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంటలను నీటితో నింపాలని, భారీ, చిన్న నీటి ప్రాజెక్టులకు అన్ని చెరువులను, కుంటలను అనుసంధానించాలని అధికారులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదేశించారు. జలసౌధలో మంత్రి హరీష్‌రావు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

harishrao

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ నెలరోజుల్లోగా రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులు, కుంటలను నీటితో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. 44, 928 చెరువుల్లో ఎన్ని గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో, ఒక్కొక్క గొలుసులో ఎన్ని చెరువులు ఉన్నాయో పూర్తిగా లెక్కలు తీయాలని, భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలోని గొలుసుకట్టు చెరువులను గుర్తించాలని సూచించారు. చెరువులను ఏఏ ప్రాజెక్టు ద్వారా నీరు నింపవచ్చో గుర్తించాలని అధికారులకు మంత్రి హరీష్‌ రావు సూచించారు. అనుసంధానం కాని చెరువులను ఏ విధంగా అనుసంధానించవచ్చో నివేదికలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీష్‌ రావు.

harishrao

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువులను, కుంటలను నీటితో నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని,  తెలంగాణ రాష్ట్రంలోని మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా 250 టీఎంసీల నీటిని వినియోగించవచ్చని ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోందని, ప్రతి ప్రాజెక్టు నుంచి చెరువులు,  కుంటలను నింపాలని, చెరువులు నిండుగా ఉండే వర్షపాతం పెరుగుతుందని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -