తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు ఓ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్. కొంతకాలంగా అపజయాలతో ఇబ్బంది పడుతున్నా.. ఇటీవల మళ్లీ పుంజుకున్నాడు. బన్నీ, వరుణ్ వంటి హీరోలతో సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే ‘పటాస్’ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు దిల్ రాజు.
ఆ మధ్యన హీరో రామ్ తను తదుపరి చిత్రంలో బ్లైండ్ గా కనిపించబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. పటాస్, సుప్రీమ్ చిత్ర్లాల దర్శకుడు అనీల్ రావిపూడి తో ముందుకు వెళ్తున్నా అన్నారు.
అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న గుసగుసలను బట్టి ఈ ప్రాజెక్టు లేనట్లే అని తెలుస్తోంది. అందుకు కారణం దిల్ రాజు అంటున్నారు. అయితే పూర్తిగా కారణం దిల్ రాజు కూడా కాదని రామ్ అని వినపడుతోంది. ‘నా 15వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఇది చాలా స్పెషల్ సినిమా. హీరో బ్లైండ్ అయినా మూవీ కమర్షియల్’ అంటూ ఆ మధ్యన రామ్ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలిసింది. అయితే రామ్ కు, దిల్ రాజు కు రెమ్యునేషన్ విషయంలో తేడాలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
హీరో రామ్ తో గతంలో దిల్ రాజు తీసిన హరేరామ.. హరేకృష్ణ చిత్రం ప్లాప్ అయింది. గత కొంత కాలంగా నేను శైలజ.. తప్ప మరో చెప్పుకోదగ్గ చిత్రం లేని హీరో రామ్ ఈ చిత్రం కోసం 6 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడని తెలుస్తోంది. కానీ తాను చేసే ప్రతి చిత్రం విషయంలో నిక్కచ్చిగా ఉండే దిల్ రాజు… రామ్ కోరిన రూ. 6 కోట్లు ఇవ్వనని చెప్పాడని తెలుస్తోంది.
కాగా గతంలో దిల్ రాజు… రవితేజ చిత్రం ఎవడో ఒకడు.. చిత్రాన్ని కూడా కేవలం రవితేజ అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడంతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఇక రామ్ విషయానికి వస్తే రామ్ తన పారితోషికం విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉంటాడని, గతంలో బెల్లంకొండ సురేష్ తీసిన కందిరీగ చిత్రం విషయంలో పారితోషికం విషయంలో నిర్మాతను ముప్పుతిప్పలు పెట్టాడనే టాకుంది. కానీ దిల్ రాజు పరిస్థితి వేరు. ఎవరి మార్కెట్ ఎంత అనే విషయంలో దిల్ రాజు పక్కాగా ఉంటాడు. కాగా తాజాగా రామ్ కు అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదని దిల్ రాజు భావిస్తుండడంతో ఈ చిత్రంలో రామ్‌ని దిల్ రాజు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే అఫ్ కోర్స్ ఇందులో ఎంతవరకూ నిజముందని తెలియాల్సి ఉంది. కేవలం ఇది రూమర్ మాత్రమేనా లేక నిజంగానే ప్రాజెక్టు కాన్స్లి ల్ అయ్యిందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే జెన్యూన్ నిర్మాత దిల్ రాజు. నిర్మాతను గౌరవించే హీరో రామ్ . కాబట్టి..ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంటోంది.