యూరియా కోసం క్యూలైన్‌లో విద్యార్థి!

1
- Advertisement -

హృదయవిదారక దృశ్యం… ఒక పాఠశాల బాలుడు తన తరగతులను వదిలేసి, కుటుంబపు పొలానికి ఎరువులు తెచ్చే క్రమంలో క్యూల్లో నిలబడ్డాడు అని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

ఇది తెలంగాణలోని చేదు వాస్తవం. రైతులకు సమయానికి ఎరువులు అందించాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం – ఇద్దరూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు.

ఎరువుల సరఫరా సక్రమంగా చేయడం బదులు, ఈ రెండు ప్రభుత్వాలు లక్షలాది మంది రైతులను ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల ఎదుట క్యూల్లో నిలబడే పరిస్థితికి నెట్టివేశాయన్నారు. మన రైతులు ఇలాంటి దైన్య పరిస్థితులకు కాదు, గౌరవప్రదమైన జీవితానికి అర్హులు అన్నారు కేటీఆర్.

 

Also Read:శ్రీవారి సన్నిధిలో తిలక్ వర్మ

- Advertisement -