నాగార్జునకు బదులుగా చిరంజీవి?..

614
Chiranjeevi to host MEK season 4
Chiranjeevi to host MEK season 4
- Advertisement -

సామాన్యుడి ఇంటి తలుపులు తట్టి దూసుకెళ్లి టీవీ షోలలోనే నంబర్‌ వన్‌ టీఆర్పీ సొంతం చేసుకుని తెలుగులో మంచి రికార్డులు క్రియేట్‌ చేసింది మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం. మా టీవీలో ప్రసారం అయిన ఈ కార్యక్రమం మూడు సిరీస్‌లు పూర్తి చేసుకుని త్వరలో నాలుగో సిరీస్‌ కు సిద్ధమవుతోంది. అయితే ఈ కార్యక్రమం ఇకపై చిరు చేతికి అందబోతోందన్న వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.

Chiranjeevi to host MEK season 4

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో బుల్లితెరమీద సూపర్ పాపులర్ షోలలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఒకటి. టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో సూపర్ హిట్ అవ్వడంతో పాటు మా టీవీ రేటింగ్స్ను అమాంతం పెంచేసింది. ప్రతి రోజు రాత్రి 9 గంటలవుతుందంటే చాలు అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు.

Chiranjeevi to host MEK season 4

అమితాబ్ లాంటి సూపర్స్టార్ హిందీలో కౌన్ బనేగా కరోడ్పతి లాంటి బుల్లితెర షోను ఓ రేంజ్లో హిట్ చేశారు. ఇక ఇక్కడ మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కూడా నాగార్జున సైతం అదే రీతలో రక్తికట్టించి అందరూ ఈ షోకు అతుక్కుపోయేలా చేశారు. ఈ షో ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ను ప్రదర్శించుకోవడంతో పాటు భారీగా నగదు గెలుచుకుని ఆర్థికంగా కూడా చాలా లాభపడ్డారు.

Chiranjeevi to host MEK season 4

ఈ షో ద్వారా నాగార్జునకు సైతం సూపర్ పాపులారిటీ వచ్చింది. వ్యక్తిగతంగా అది నాగ్కు చాలా హెల్ఫ్ అయ్యింది. ఈ షో తర్వాత నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ షో నుంచి నాగార్జున అవుట్ అవనున్నాడని సమాచారం.

 

నాగార్జున హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోను ఈ సారి మెగాస్టార్ చిరంజీవి చేత చేయించాలని మాటీవీ యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటి దాకా నాగ్ మూడు సీజన్లు చేశారు..నాలుగో సీజన్ డిసెంబర్ 12 నుంచి మొదలుకాబోతోంది. దీనికి హోస్ట్ గా నాగ్ కు బదులు చిరు చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. నాగ్ వద్దన్నారో లేక చిరు ఆసక్తి చూపారో తెలీదు గానీ నెక్స్ట సీజన్ మాత్రం చిరు చేయడం ఖాయమంటున్నారు. మూడో సీజన్ లో ఓ గెస్ట్ గా చిరంజీవి లో పాల్గొన్నారు.
చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కు ఇబ్బందికలగకుండా దీని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -