నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా తాజా షెడ్యూల్ ఈరోజు(ఆగస్ట్ 29న) మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది.
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన గురించి నందమూరి బాలకృష్ణ సినిమా తీస్తున్నాడనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. అందరి అంచనాలను అందుకునేలా సినిమాను దర్శకుడు జాగర్లమూడి క్రిష్, నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో భారీ యుద్దనౌక నౌక ఎసెట్‌ను వేసి యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరించారు. అలాగే జార్జియాలో ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే సన్నివేశాలను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించారు. అంతకు ముందుకు మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా చిత్రీకరణతో పాటు సీజీ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్య ప్రదేశ్‌లో జరుగుతున్న షెడ్యూల్ 18 రోజుల పాటు జరగనుంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి బాలకృష్ణ, శ్రియాశరన్, హేమామాలిని తదితరులు పాల్గొంటున్నారని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.