మెగా ప్రాజెక్టులకు రాయితీ…

549
- Advertisement -

మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగులు వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని మంత్రి కెటి రామరావు తెలిపారు. మెగా ప్రాజెక్టులపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమటీ ఇవాళ భేటీ అయింది. మెగా ప్రాజెక్టులకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రభుత్వ మద్దతుపైన అధ్యాయనం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లోని సౌకర్యాలతో కూడిన తులనాత్మక అధ్యాయన నివేధిక వారంలోగా సబ్ కమీటీకి సమర్పించాలని కోరారు. ఇప్పటికే ఇండస్ట్రీయల్ పాలసీ ద్వారా మెగా ప్రాజెక్టులు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తున్నప్పటికి, అయా పరిశ్రమల వర్గాలు కోరుకుంటున్న అంశాలపైన వారితో చర్పించి ఒక నివేదిక ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఏంచుకున్న 14 కీలక రంగాల్లోని పరిశ్రమల స్థాపనకు దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే ప్రభుత్వ రాయితీ విషయంలోనూ పారదర్శకంగా, పకడ్బందీగా ఉంటుందని, నిబందనల మేరకు, పరిశ్రమల పురోగతి మేరకు రాయితీలుంటాయని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది. ఇక ఇప్పటి దాకా మెగా ప్రాజెక్టు కేటగిరిలోకి వచ్చేందుకు నిర్ణీత 200 కోట్ల పెట్టుబడిలో లేని భూమి, యంత్ర సామగ్రిని ఇకపైన పెట్టుబడిగా పరిగణించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. అయితే కొనుగోలు చేసిన భూమి, దాని ఉపయోగం పైన పరిమితులు విధించేందుకు నిర్ణయించింది.

ktr

త్వరలోనే జియస్టీ బిల్లు అమలులోకి రానున్న నేపథ్యంలో పరిశ్రల నుంచి వస్తున్న వ్యాట్ రియంబెర్స్ మెంటు డిమాండ్ల పరిశీలనను, జియస్టీ విధానాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం పరిశ్రమలు వివిధ జోన్లలో ఏర్పాటు చేస్తూ, నాల కన్వర్షన్ కోసం అనేక దరఖాస్తులు వస్తున్నాయని, అయితే దీంతో దీర్ఘకాలంలో మాస్టర్ ప్లాన్ల ఉద్దేశ్యం, లక్యాలు నెరవెరక పోయే అవకాశం ఉందని మంత్రి వర్గఉ పసంఘం అభిప్రాయపడింది. దీనికోసం తర్వలోనే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ భూములతో కూడిన ఒక అట్లాస్( మ్యాపులు) తయారు చేయాలని, దీన్ని జియో మ్యాపింగ్ చేయాలన్నారు. దీని ద్వారా భవిష్యత్తులు పారిశ్రామిక అవసరాలు నిర్దేశించిన ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏర్పాటు చేయాల గట్టి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది.

ఈ మేరకు ప్రస్తుతం హెచ్‌ఏండిఏ పరిధిలో టీఎస్‌ ఐఐసి వద్ద ఉన్న 220కి పైగా పారిశ్రామిక స్థలాల అట్లాస్ ను వారంతో మంత్రులకు అందజేయాలని అధికారులను అదేశించింది. నిబంధనల ప్రకారం ప్రకారం రాయితీలు పొందకూడని జాబితా నుంచి సోలార్ మరియు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్లాంట్లను మినహాయించాలని నిర్ణయం జరిగింది. సోలార్ ప్లాంట్లకు ఇచ్చే స్థాంప్ డ్యూటీ రాయితీలను పిపిఏల్లో సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నూతన పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉద్యోగాలు అత్యధికంగా కల్పిస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన సినియర్ అధికారులు పాల్గొన్నారు.

ktr

- Advertisement -