విదేశీ గూఢచార సంస్థలు ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఇప్పుడు బంగ్లాదేశ్‌లో పూర్తి స్వేచ్ఛతో పనిచేస్తున్నాయని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జోయ్ ఆరోపించారు. బంగ్లాదేశ్ ఒక విఫల దేశంగా మారిపోయిందని మరియు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకపోతే ప్రాంతీయ తీవ్రవాదానికి కేంద్రంగా మారే ప్రమాదం ఉందని సజీబ్ వాజెద్ జోయ్ హెచ్చరించారు.
అమెరికాలోని మేరీల్యాండ్ నుండి వర్చువల్‌గా ప్రసంగించిన జోయ్…విదేశీ గూఢచార సంస్థలు, ప్రత్యేకించి పాకిస్తాన్‌కు చెందిన ISI ఇప్పుడు బంగ్లాదేశ్‌లో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరిస్తున్నాయని అన్నారు. అవామీ లీగ్ ప్రభుత్వం హయాంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న వందలాది మంది శిక్షాపడ్డ ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేశారని ఆయన ఆరోపించారు. నిషేధిత సంస్థ అయిన ‘హిజ్బ్ ఉత్-తహ్రీర్’ ఇప్పుడు బహిరంగంగా ర్యాలీలు నిర్వహిస్తోందని అల్-ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తులు బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!
భారతదేశాన్ని అత్యంత ఆందోళనకు గురిచేసే విషయం ఏమిటంటే.. భారతదేశానికి తూర్పు వైపున బంగ్లాదేశ్ ‘మరొక పాకిస్తాన్’లా మారింది. ఈ రోజు మీ తూర్పు సరిహద్దులో మరొక పాకిస్తాన్ తయారైంది… అల్-ఖైదా నిర్వాహకులు బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది ఇదే, ఇది భారతదేశానికి లేదా మొత్తం ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంటూ ఇది న్యూఢిల్లీ భద్రతకు నేరుగా సంబంధించిన అంశంగా వివరించారు.

