మజ్నూపై భారీ అంచనాలు..

642
- Advertisement -

టాలీవుడ్ లో వరుసపెట్టి హిట్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు న్యూచురల్ స్టార్ హీరో నాని. అయితే ఈన్యాచురల్ స్టార్ అసలు ఏ క్లబ్ కు చెందినవాడు అనేదే మాత్రం ఫైనల్ గా తేలాల్సిన విషయం. ఆ విషయం తెలియాలంటేఇప్పుడు త్వరలో రిలీజ్ అవ్వబోతున్న మజ్నూ సినిమాతో గురుడు మార్కెట్ ని గట్టిగా కొట్టాలి. అప్పుడు అసలు ఈ యంగ్ హీరోకి ఉన్న అసలు రేంజ్ ఏంటో తెలుస్తుంది. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఏకంగా పాతిక కోట్లు షేర్ వసూలు చేసాడు నాని. అయితే ఆ తర్వాత వచ్చిన కృష్ణగాడివీర ప్రేమగాధ సినిమా మాత్రం 10 కోట్ల వరకే కలెక్ట్ చేసి ఆగిపోవడం ఆశ్యర్యం కలిగించింది. సినిమా ఫైనల్ కలక్షన్లనునిర్మాతలు రిలీజ్ చేయకపోవడం ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం.

అయితే ఆ తరువాత రిలీజైన జెంటిల్మన్ మాత్రంఏకంగా 17.5+ కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే మాంచి కంటెంట్ కు నాని స్టార్డమ్ కలిస్తే రిజల్ట్ అలా ఉంటుందో ప్రూవ్ అయినట్లే కదా.మరిప్పుడు ఇదే సరైన టైమ్ అని చూసుకుని మజ్నూ తో వస్తున్నాడు కాబట్టి.. ఈ సినిమా ఖచ్చితంగా 25 కోట్ల షేర్మార్కును టచ్ చేస్తుందని ఒక అంచనా కూడా బలంగా వినిపిస్తోంది. అలా చేస్తే మాత్రం ఇక నాని మార్కెట్ రేంజ్ అమాంతం పెరగడం ఖాయంగా కనిపిస్తుందని, ఓవర్సీస్ లో కూడా అదే దూకుడు కొనసాగిస్తే నాని ఇక వెనుతిరిగిచూసుకునే సమస్యే లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

actor-nani-majnu-movie-first-look-poster-revealed

ఏదిఏమైనా సరే, చిన్నహీరోగా టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పరుచుకున్న నాని, ఇప్పుడు ఇలాకోట్ల క్లబ్ లోకి చేరిపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మనోడిగి ఓవర్సీస్ లోఉన్న మార్కెట్ చూసిఇప్పుడొస్తున్న స్టార్ హీరోల కొడుకులకి దిమ్మతిరిగిపోతుందనే చెప్పాలి. అంతేకాదు, సినిమా సినిమాకి తన రేంజ్ నిపెంచుకుంటూ పోతున్నాడు. కొత్తహీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు నానితో సినిమాచేసేందుకు ప్రొడ్యూసర్స్ అందరూ క్యూ కడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Majnu-Stills

- Advertisement -