నాగ్ పై ఒత్తిడి పెంచుతున్న సమంత..!!

232
naga samanta
naga samanta
- Advertisement -

‘టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్న సమంత, హీరో నాగచైతన్యని వివాహం చేసుకోబోతున్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేదిచెప్పకపోయినప్పటికీ ఇటీవల జరిగిన నిర్మల కాన్వెంట్ వేదిక పైన మాత్రం కింగ్ నాగార్జున తన ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లుచేయాలని, వాళ్లిద్దరి సినిమాలు చేయాలని మాత్రం చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా సమంత వైపు నుంచి నాగ్ కు.. పెళ్లివిషయంలో దేనికైనా ఓకె కానీ, ఒక్కటే కండిషన్ అని చెప్తోందట.అదేంటంటే, పెళ్లి చర్చిలో ముందుగా జరగాలి అన్నదే. ఆ తరువాత కావాలంటే హిందూ సంప్రదాయం ప్రకారమో, లేదారిసెప్షన్ నో ఇంకేదైనా ఓకె అని, కానీ ముందుగా చర్చిలో మాత్రమే తమ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగాలని సమంత కోరుతున్నట్లు సమాచారం.

Nagarjuna, Samantha, Naga Chaitanya, Akhil @ Nimmagadda Prasad Daughter Wedding Photos

అయితే నాగ్ తన కొడుకు నాగ చైతన్య పెళ్లికి చెన్నయ్ ను వెన్యూగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సమంత తల్లితండ్రులుతమ సంప్రదాయ పద్దతుల్లో, తమకు అలవాటైన చర్చిలో తమ కుమార్తె పెళ్లి జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.దీనికి అమల కూడా ఓటేసినట్లు తెలుస్తోంది. ఏమాయ చేశావే సినిమాలో చైతూ చర్చి సీన్ గుర్తింది కదా.. సేమ్ మళ్లీఅలాంటి రియల్ లైఫ్ సీన్ కావాలనే ఇలా చేస్తుందని కొంతమంది సరదాగా సెటైర్స్ వేసుకుంటున్నారు. అక్కడ పెళ్లి జరిగిన వెంటనే హైదరాబాద్ లో నాగ్ ఓ భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఏర్పాట్లపై అన్నీ దగ్గరుండి చూసుకునే ప్లాన్ ను అమలు చేయనున్నాడు నాగ్. ఇక పనిలో పనిగా ఇదే డేట్ లో అఖిల్వెడ్డింగ్ ని కూడ ప్లాన్ చేసేస్తున్నాడు నాగ్. అయితే అఖిల్ ఎంగేజ్ మెంట్ ఉంటుందా ? లేదా వెడ్డింగ్ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అక్కినేని వారింట మాత్రం త్వరలోనే భారీగా బాజాభజంత్రీలు మోగనున్నాయి.

- Advertisement -