మంచాల కోసం వస్తే..జెండా మిగిలింది

236
- Advertisement -

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖాట్ సభలో సేమ్ సీన్ రిపీటైంది. పాంచ్‌లారి క్రిత్‌ఫురి గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన రాహుల్ రైతులతో మాట్లాడేందుకు ఖాట్(మంచం) సభలను ఎంచుకున్నారు. రైతులతో వాళ్ల వాళ్ల గ్రామాల్లోనే మంచాలపై కుర్చుకుని ముచ్చటించేందుకు ఏర్పాట్లుచేశారు. అయితే సమావేశం ముగిసిన అనంతరం సభకు వచ్చిన వారు మంచాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.

up rahul meeting  up

దీనిపై సోషల్‌ మీడియాలో, ఆంగ్ల పత్రికల్లో వ్యంగ్యంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్ రైతులు మంచాలను ఎత్తుకెళ్లడం దొంగతనంగా భావిస్తే దేశం నుంచి కోట్లకు కోట్లు ఎత్తుకెళ్తున్న విజరుమాల్యా (9వేల కోట్లు)లాంటి వాళ్లని ఏమనాలి.. వాళ్లే పెద్ద అపరా ధం చేసిన వారు’ అని ట్విట్టర్‌లో పేర్కొనగా తాజాగా మీర్జాపూర్‌లో రాహుల్ సభ ముగియగానే వచ్చినవాళ్లంతా మంచాల కోసం కొట్టుకున్నారు. కొద్ది సెకండ్లలోనే అక్కడ వేసిన మంచాలన్నీ మాయమైపోయాయి.

up CsTMxihVMAAzqgZ

‘మంచాలు అక్కడే వదిలేసి వెళ్లండి’ అంటూ మైకులలో ప్రకటించినా.. ఎవరూ వినిపించుకోలేదు. అసలు తమకు ఉచితంగా మంచాలు ఇస్తామని చెప్పడం వల్లే మీటింగుకు వచ్చామని కైలాష్ నాథ్ కేసరి అనే పెద్దాయన చెప్పారు. ఈ సమావేశానికి హాజరైతే చాలు.. ఉచితంగా మంచాలు ఇస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు తమకు చెప్పారని ఆయన మీడియాతో అన్నారు. అయితే, తనకు మాత్రం మంచం ఇవ్వలేదు గానీ.. చేతిలో ఈ జెండా పెట్టి పోయారని కాంగ్రెస్ జెండాను చూపించారు. యూపీలో మొత్తం 2,500 కిలోమీటర్ల మేర యాత్రను రాహుల్ తలపెట్టిన విషయం తెలిసిందే.

rahul

- Advertisement -