నీతులు చెప్పే బోయపాటి.. ఇంతటి ఛీటా..?

295
Koratala Siva Vs Boyapati Srinu
Koratala Siva Vs Boyapati Srinu
- Advertisement -

ఒకరి కథ మరొకరి పేరుతో చలామణీ అవ్వడం… రచయితల్ని తొక్కేయడం ఇండ్రస్ట్రీలో మామూలే. కొంతమంది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనే టైటిల్ కార్డ్ కోసం రచయితల కథల్ని వాడేసుకొంటుంటారు. అలాంటి ఉదంతాలు ఎన్నో. కానీ వెలుగులోకి వచ్చేవి కొన్నే. ఇప్పుడు అలాంటి కథల కబ్జా వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. దాంతో ఇద్దరు టాప్ దర్శకుల మధ్య చిచ్చు రేగింది. కొరటాల శివ రచయితగా పనిచేస్తున్నప్పటి వ్యవహారం ఇది. దర్శకుడిగా ఫామ్ లోకి వచ్చాక.. పాత విషయాన్ని మళ్లీ కెలుకుతున్నాడు.
సింహా టైమ్లో బోయపాటి శ్రీను దగ్గర పనిచేశాడు కొరటాల. ఆ సినిమాకి కథ, మాటలు అందించింది కొరటాలేనట. అయితే బోయపాటి శ్రీనుమాత్రం.. రెండు టైటిల్ కార్డ్స్ ఇవ్వను, కథ, లేదంటే మాటలకు నీ పేరు వేస్తా అన్నాడట. `రెండూ వద్దులే` అని కొరటాల అలగడం.. నిజంగానే టైటిల్ కార్డులో కొరటాల శివ పేరు కనిపించకపోవడం జరిగాయి. అయితే అప్పట్లో కొరటాల అంటే ఎవ్వరికీ తెలీదు. ఆ గొడవ కూడా బయటకు రాలేదు. ఇంతకాలానికి పాత విషయాన్ని బయటకు లాగాడు కొరటాల శివ.
మిర్చి సినిమా ద్వారా మనందరికీ పరుచయం అయిన వ్యక్తి కొరటాల శివ, కాని రచయితగా అంతకముందు చాలా సినిమాలకు పనిచేశాడు భద్ర, బృందావనం, ఇలా సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనుభవంతో ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తరువాత వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ కొరటాల శివను మరో స్థానానికి తీసుకెళ్లాయి. అయితే తాజాగా కొరటాల ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…తను సింహ సినిమాకు కథ, మాటలు అందించానని కాని ఆ సినిమాకు నా పేరు కూడా వెయ్యలేదని చెప్పాడు, ఈ సినిమా టైం లో బోయపాటి శ్రీను తనను వాడుకొని కనీసం పేరు కూడా వెయ్యలేదని ఆరోపించాడు.

 

ఇలా రచయితగా తనకు విలువ లేదని అందుచేతనే దర్శకుడిగా మారాల్సి వచ్చిందని చెప్పాడు. సింహ సమయంలో బోయపాటి కి కొరటాల శివకు మధ్య చాలా రాజకీయం నడిచిందని, కావాలనే బోయపాటి తన పేరు లేకుండా చేశాడని ఫిలిం నగర్ టాక్. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు హైలెట్ అవుతుందో? కొరటాల శివ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకో మీడియాకు చెప్పాడో తెలినప్పటికి సినిమా ఇండస్ట్రీ లో వాడుకొని వదిలేసే రకాలు చాలా మంది ఉన్నారని, రచయితలకు విలువ లేదని తెలుస్తుంది.
ఇప్పుడు కొరటాలకు మద్దతుగా కొంతమంది రచయితలు ఫేస్బుక్ , ట్విట్టర్లలో కామెంట్స్ పెడుతున్నారు. మరో వైపు బోయపాటి కూడా ఈ విషయంలో సీరియస్ అవుతున్నట్టు సమాచారం. ఓ దర్శకుడు మరో దర్శకుడిపై బురద చల్లాలనుకోవడం.. దాన్ని మీడియా ముందు రచ్చ చేయడం. ఇవన్నీ ఉపేక్షించదలచినవి కావు. ఓ రచయిత శ్రమని మరో దర్శకుడు దోచుకోవడం కూడా క్షమార్హం కావు. మొత్తానికి ఈ వ్యవహారంచూస్తుంటే గొడవ ముదిరేటట్టే కనిపిస్తోంది.

 

- Advertisement -