గణపతి బప్పా మోరియా….అగ్లె బరస్ తూ జల్దీ ఆ, జైబోలో గణేష్ మహరాజ్ కీ జై…అంటూ భక్తి పారవశ్యంతో ట్యాంక్ బండ్ ప్రాంతాలు మారుమ్రోగిపోతున్నాయి.భారీగా వర్షం కురుస్తున్నా..గణేష్ శోభాయత్ర వైభవంగా జరుగుతోంది.డప్పు వాయిద్యాలు, యువత కేరింతల నడుమ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో బై బై అంటూ గణేషుడు ముందుకు సాగుతున్నాడు.పోటెత్తిన జనంతో నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు, పిల్లలు, యువత అందరూ లయబద్ద నృత్యాలతో రంగులు చల్లుకుంటూ ఊరేగింపులు ఆసాంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.
అశేష భక్తజన సందోహం నడుమ ఖైరతాబాద్ బడాగణేషుడి నిమజ్జనం ముగిసింది. ఇన్నేళ్లలో మొదటిసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు మధ్యాహ్నామే ట్యాంక్ బండ్ చేరుకోవడం విశేషం.శోభాయాత్రకు ఉదయమే భారీ ఎత్తున పూజలు చేశారు. కలశపూజ చేసి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. ప్రధాన విగ్రహంతో పాటు బాలాజీ, గోవర్థనగిరి ఘట్టాలు ముందుకు సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు మీరాటాకీస్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ట్యాంక్‌బండ్ చేరుకుంది. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా గణనాథులు ట్యాంక్‌బండ్ దిశగా బయలుదేరారు. సిటీ మొత్తం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అన్ని చర్యలు తీసుకుంది. దీనికి అనుగుణంగానే హుస్సేన్‌సాగర్ చుట్టూ 34 క్రేన్లుతో పాటు పోలీసు నిఘా కోసం 44 కెమెరాలను ఏర్పాటు చేసింది. గణేష్ ఊరేగింపు రూట్లలో 12 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవన్నీ వైపైతో పనిచేస్తాయని వారు తెలిపారు. తొలిసారి వైఫై సీసీ కెమెరాలను హైదరబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు.
Completed the immersion of Khairtabad #GaneshVisarjan pic.twitter.com/jzZ9EP2qTo
— Hyderabad City Police (@hydcitypolice) September 15, 2016