“బంతిపూల జానకి” సంతోషాన్నిస్తోంది

579
praveen nellutla
praveen nellutla
- Advertisement -

చిన్న సినిమాలు రెండు మూడు రోజులాడడమే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది “బంతిపూల జానకి”. ఈ చిత్రం సాధిస్తున్న విజయం ఇస్తున్న ఉత్సాహంతో.. సినిమా ప్రారంభంలో టైటిల్స్ వస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయిన “బంతిపూల జానకి” టైటిల్ సాంగ్ ను.. హీరోయిన్ దీక్షాపంత్, ధన్ రాజ్, అదుర్స్ రఘు, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ తదితరులపై ప్రత్యేకంగా చిత్రీకరించి ఈ చిత్రానికి జోడించారు. అంతే కాదు, ఈ పాటతోపాటు కొన్ని హాస్య సన్నివేశాల్ని కూడా జత చేశామని చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ చెబుతున్నారు.

Banthi-Poola-Janaki-New-Photos-0

ఈ చిత్రం విజయం సాధిస్తుండడాన్ని పురస్కరించుకొని చిత్ర దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. “దర్సకుడిగా “బంతిపూల జానకి” నాకు రెండో చిత్రం. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రం రెండో వారంలోనూ ఉభయ రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం చాలా సంతోషాన్నిస్తోంది. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నాకు ఇంత మంచి అవకాశం ఇఛ్చిన మా నిర్మాతలు కళ్యాణి-రామ్-తేజ్ లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దర్శకత్వం వహించే మూడో చిత్రం వివరాలు త్వరలోనే తెలియజేస్తాను” అన్నారు. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ కి కల్యాణి-రామ్-తేజ్ నిర్మాతలు.

- Advertisement -