ప్రచారంలో దొంగలు..నిన్న కేఏపాల్..నేడు షర్మిల

799
sharmila gold ring
- Advertisement -

ఓ వైపు నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా మరోవైపు దొంగల తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కేఏ పాల్ మెడలో నుండి చైన్ కొట్టేయడం ఇంకా మరువక ముందే తాజాగా వైసీపీ నేత,జగన్ సోదరి షర్మిల చేతికి ఉన్న ఊంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన షర్మిల చేతిని వెనక్కి లాక్కున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల.. రోడ్‌ షోలతో బిజీ అయ్యారు. స్థానికులతో అభివాదాలు చేస్తూ ముందుకుసాగుతున్నారు. షర్మిల సభలకు జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో అందరిని ఆప్యాయంగా పలకరించే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి షర్మిల చేతికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు.

అయితే ఉంగరం చేతికి టైట్‌గా ఉండటంతో సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ చోరీ యత్నం మొబైల్‌ రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -