దర్శకుడు శ్రీవాస్ కి ‘రామబాణం’ రూపంలో దారుణమైన పరాజయం అతని ఎకౌంట్ లో పడింది. పాపం తాను కేజీఎఫ్ రేంజ్ సినిమా తీయాలి అని కలలు కంటే… తన చేత హీరో గోపీచంద్ ‘రామబాణం’ తీయించాడు అని చెప్పుకుని బాధ పడ్డాడు. దీనికితోడు, సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఐతే, ఏ దర్శకుడికి అయినా పెద్ద హీరోలతో సినిమా చేయాలని వుంటుంది. చిన్న సినిమా చేతిలో పడిన తరువాతే ప్రూవ్ చేసుకుని పెద్ద హీరోల దగ్గర చాన్స్ కొట్టే దర్శకులే ఎక్కువ. దర్శకుడు శ్రీవాస్ కూడా దీనికి అతీతుడు కాడు. గతంలో లౌక్యం సినిమాతో హిట్ కొట్టి, బాలయ్యతో సినిమా ఛాన్స్ కొట్టాడు.
కానీ, బాలయ్య బాబుతో ప్లాప్ సినిమా తీసి, మళ్లీ చిన్న డైరెక్టర్ల లిస్ట్ లో శ్రీవాస్ చేరిపోయాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీవాస్ ఇప్పటి వరకు చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. రామబాణం సినిమాకు చాలా టైమ్ తీసుకున్నారు. తీరా చూస్తే సినిమా భారీ ప్లాప్ అయింది. సరే ఆ సంగతులు అన్నీ ఎలా వున్నా గోపీచంద్ తో సినిమా విషయంలో శ్రీవాస్ కొంత తడబడ్డారన్నది వాస్తవం. గోపీచంద్ సినిమాలకు కావాల్సిన హై లు… ఎలివేషన్లు సెట్ చేయడం శ్రీవాస్ కు కుదరలేదన్నది ఇంకా వాస్తవం.
Also Read:ఒక్కపూటే తిని బతికాడట
దీంతో ఇప్పుడు దర్శకుడు శ్రీవాస్ ప్లానింగ్ లో వున్న మరో రెండు సినిమాలకు గండం ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నితిన్, రవితేజ లాంటి హీరోలు శ్రీవాస్ తో సినిమాలు అనుకున్నారు. కానీ, ఇప్పుడు వారంతా ఆలోచనలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే శ్రీవాస్ తో సినిమా అంటే మిగిలిన హీరోలు కూడా ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. కాబట్టి, శ్రీవాస్ కి ఇప్పట్లో ఛాన్స్ రాకపోవచ్చు.