పోలీసు అమరవీరుల సేవలు మరిచిపోలేనివి…

185
- Advertisement -

నగరంలోని నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పోలీసు అమరవీరుల స్మారక పరుగు ప్రారంభమైంది. పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాలను పురస్కరించుకుని నగరంలోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పోలీసు అమరవీరుల స్మారక పరుగును గవర్నర్ నరసింహాన్ ప్రారంభించారు.

POLICE MARTYRS , MEMORIAL RUN

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని, పోలీసు అమరవీరుల సేవలు మరిచిపోలేనివని కొనియడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువయ్యేందుకు పరుగు సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అరుణ బహుగుణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ పోలీసు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 10కె, 5కె, 2కె విభాగాల్లో నిర్వహించిన స్మారక పరుగులో 8వేల మందికి పైగా పోలీసులు, అథ్లెట్లు పాల్గొన్నారు.

- Advertisement -