పెళ్లికాకుండానే తల్లికాబోతున్న 2.0 బ్యూటీ..!

880
amy jackson
- Advertisement -

ఎవడు,ఐ,2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ అమీ జాక్సన్‌. తన అందచందాలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన ఈ బ్యూటీ తల్లికాబోతుంది. మార్చి 31 మదర్స్ డే సందర్భంగా తాన తల్లిని కాబోతున్నానని తెలిపింది అమీ. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్‌ లో ఉన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఈ నేపథ్యంలో యూకేలో తాను తల్లి కాబోతున్నట్లు అమీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురు చూస్తున్నాను. ఈ విషయం చెప్పేందుకు మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు. ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం తెలిపింది.

తన పోస్ట్‌లో కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అమీ ప్రకటనతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మద్రాసు పట్టణం మూవీతో తెరంగేట్రం చేసిన అమీ నటించిన కిక్ 2 త్వరలో విడుదల కానుంది.

https://www.instagram.com/p/BvqigfhhAi8/
- Advertisement -