సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలకు, హీరోయిన్లకు ఎందరో అభిమానులుంటారు. అయితే కొత్త, పాత అనకుండా ఇటీవల కాలంలో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలకు ఈ ఫాలోయింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది. ఇదే కోవకి చెందిన మళయాలి ముద్దుగుమ్మ సాయిపల్లవి. ప్రేమమ్ చిత్రంలో టీచర్ గా కనిపించిన ఈ బ్యూటీ చేసిన యాక్టింగ్‌కి అభిమానుల నుండి విశేష స్పందన లభించింది.
అంతే కాకుండా ఆన్ లైన్ లో సైతం వందల కొద్ది లవ్ ప్రపోజల్స్ సాయిపల్లవి ఖాతాలో చేరిపోవడంతో తన ఇంట్రస్ట్ ను బయటపెట్టింది ఈ హీరోయిన్. అటు తమిళ్‌లోనూ, ఇటు తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. అయితే సూర్య అంటే సాయి పల్లవికి కేవలం ఇష్టం మాత్రమే కాదట. పిచ్చి ప్రేమట.
సూర్యను ఆమె ప్రేమిస్తున్న విషయాన్నిసాయి పల్లవి స్వయంగా చెప్పింది. సూర్యకు హీరోయిన్ జ్యోతికతో పదేళ్ల క్రితమే పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ సూర్య ఎప్పుడు కనిపించినా ప్రపోజ్ చేయడానికి తాను రెడీ అని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే సింగం హీరో సూర్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు సాయి పల్లవి తహతహలాడుతోందని తెలుస్తోంది. మరి సాయి పల్లవి మాటలు వింటే జ్యోతిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.