పీఎస్ లో రొమాన్స్

236
uttipattu kamarajanagar
uttipattu kamarajanagar
- Advertisement -

కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ యువతి తమిళనాడులోని వేలూరులో వీరంగమాడింది. ప్రియుడితో కలిసి మద్యం సేవించిన ఆ యువతి… బైకును ర్యాష్ గా నడుపుతున్నారెందుకంటూ ప్రశ్నించిన వ్యక్తిపై విరుచుకుపడింది. రోడ్డుపై ఈ న్యూసెన్స్ ఏమిటంటూ అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా చించి మరీ దాడి చేసింది.

ఇక అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా ఎస్సైపైనా ఆ యువతి విరుచుకుపడింది. ఎలాగోలా పోలీస్ స్టేషన్ కు తరలించిన ఆ యువతి ఖాకీల ముందే ప్రియుడితో ముద్దులాట మొదలెట్టింది. దీంతో షాక్ తిన్న పోలీసులు…వారిని విడదీసి ప్రియుడిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టి, పోలీసులపై దాడి చేసిన కేసులో ఆ యువతిని మాత్రం సెంట్రల్ జైలుకు తరలించారు.

అతను తుత్తిపట్టు కామరాజనగర్‌కు చెందిన వివేకానంద్‌ అని, ఆ యువతి బెంగుళూరుకు చెందిన అర్చనగా గుర్తించారు. వివేకానంద్‌పై మద్యం మత్తులో వాహనం నడిపిన కేసు నమోదు చేసి జరిమానా విధించి పంపించేశారు. పోలీసులపై దాడి చేసిన ఆ యువతిపై కేసు నమోదు చేసి రాత్రి ఎనిమిది గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వేలూరు మహిళా కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

- Advertisement -