పవన్ మనోడే…ఏమనొద్దు

623
- Advertisement -

ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం ప్యాకేజీ ఇవ్వడంపై ప్రజల నుంచి తీవ్రత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత రెండేళ్ల నుంచీ ఉరిస్తున్న కేంద్రం ఇప్పుడు పాచిపోయిన రెండు లడ్డూలు ఆంధ్రులకు ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. బీజేపీ,టీడీపీ నేతలంతా అదిగదిగో అంటూ ప్రజలను ఆశ పెట్టారని.. చివరికి ప్యాకేజీ ఇస్తారనుకుంటే రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారని మండిపడ్డారు.

అవకాశవాద రాజకీయాల వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని.. పదవులే ముఖ్యమైతే ప్రజా సమస్యలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో విభేదాల్లేవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను అవకాశవాదంగా మార్చుకుంటున్న వారిని హెచ్చరిస్తున్నానంటూ.. రాజకీయనాయకులంతా దేశంలోని సమస్యలు తీర్చలేకపోయినా పర్వాలేదని… వాటిని మరింతగా పెంచొద్దని హితవు పలికారు. టీడీపీ,బీజేపీ నేతల వైఖరిని ఎండగట్టారు.

chandra babu

వ‌న్ క‌ల్యాణ్ ప్రసంగం చేసిన దృష్ట్యా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చెయ్యొద్ద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీడీపీ నేత‌లకు సూచించారు. హైద‌రాబాద్‌లో అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ శాసనసభాపక్షం భేటీ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పవన్‌ వాదనను మ‌నం అర్థం చేసుకోవాలన్నారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్యాకేజీని తిర‌స్క‌రించ‌లేమ‌ని అన్నారు. అయితే, ప్యాకేజీతో స‌రిపెట్టుకోబోమ‌ని, హోదా కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా అభివృద్ధి చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పవన్ పోరాడితే మంచిదేనని…పవన్ పై విమర్శలు చేయోద్దని మనోడేనని పరోక్షంగా కార్యకర్తలకు సంకేతాలిచ్చారు.

- Advertisement -