ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఈ మాట మహేబాబు భార్య నమ్రతకు కరెక్ట్ గా సరిపోతుంది. మోడల్ గా, హీరోయిన్ గా.. మిస్ ఇండియాగా.. నమ్రత కెరియర్ లో అన్నీ విజయాలే. వీటన్నంటికన్నా మించి ఒక ఇల్లాలిగా నమ్రత ఎంతో వినమ్రంగా జీవితాన్నిగడుపుతున్నారు.
ఈ మధ్యే ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంది. ఆమె కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఆమెతో పాటు ఉన్నారు. సినిమా షూటింగ్ కారణంగా మహేష్ తిరుమలకు రాలేకపోయాడట.ఇక అసలు విషయానికొస్తే..నమ్రత తలనీలాలు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో పెద్ద మొక్కు ఉంటే కానీ, మహిళలు తలనీలాలు ఇవ్వరు. నమ్రత మొక్కు వెనక రీజన్ కూడా అలాంటిదేనట.
ఆగడు ప్లాప్ తరువాత మహేష్ బాబు కెరియర్ బాగుండాలనే నమ్రత.. శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందని సమాచారం. ఆ తరువాత శ్రీమంతుడు హిట్ కావడంతో ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుందని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.