నా వల్లే కోహ్లీ ఆట మెరుగయ్యింది…

587
- Advertisement -

2010లో విరాట్‌ కోహ్లి, నెహ్రా, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా సహా కొంత మంది ఆటగాళ్లు నన్ను కలిసి మేం 30-40 పరుగులు చేసిన తర్వాత అవుట్‌ అయిపోతున్నానని, ఏం చేయాలో చెప్పమని సలహా అడిగారు. నేను కొన్ని సలహాలు చెప్పడంతో తను ఆట మెరుగయ్యిందని గుర్‌మీట్‌ రామ్‌ రహీం సింగ్‌ జీ వెల్లడించారు. ‘మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌'(ఎం.ఎస్‌.జి), ‘ఎం.ఎస్‌.జి 2’ సినిమా సక్సెస్‌ల తర్వాత గుర్‌మీట్‌ రామ్‌ రహీం సింగ్‌ జీ టైటిల్‌ పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘ఎం.ఎస్‌.జి- ది వారియర్‌ లయన్‌ హార్ట్‌’. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ భాషల్లో సినిమా అక్టోబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది.

ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…. గుర్‌మీట్‌ రామ్‌ రహీం సింగ్‌ జీ మాట్లాడుతూ – ”నేను సినిమాల్లో రావడానికి ఎటువంటి ట్రైనింగ్‌ తీసుకోలేదు. యాక్టింగ్‌ చేయడానికి నేరుగా సెట్‌కు వచ్చేసేవాడిని. షాట్‌ పూర్తి కాగానే ఆర్ట్‌ డైరెక్షన్‌, మ్యూజిక్‌ అన్నీ విభాగాల్లో నేను పార్టిసిపేట్‌ చేసేవాడిని. ఇది సాధారణ వ్యక్తి వల్ల అయ్యే పనికాదు. కానీ నేను ఐదేళ్ళ వయసు నుండి గురు మంత్రం చేస్తుండటం వల్ల నాకు ఇవన్నీ సాధ్యమయ్యాయి.

lion

2010లో విరాట్‌ కోహ్లి, నెహ్రా, శిఖర్‌ ధావన్‌, అమిత్‌ మిశ్రా సహా కొంత మంది ఆటగాళ్లు నన్ను కలిసి మేం 30-40 పరుగులు చేసిన తర్వాత అవుట్‌ అయిపోతున్నానని, ఏం చేయాలో చెప్పమని సలహా అడిగారు. నేను కొన్ని సలహాలు చెప్పడంతో తను ఆట మెరుగయ్యింది. తను ఇప్పుడు ఇండియన్‌ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను హైదరాబాద్‌కు తొలిసారి వచ్చాను. సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మనం చెప్పే విషయాన్ని యూత్‌ కరెక్ట్‌గా రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పాలనుకున్న విషయాలను సినిమాల ద్వారా చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ సినిమాలో నేను గురువులాగా కాకుండా ఒక యోధుడు పాత్రలో కనపడతాను. సినిమాలో మన సంస్కృతిని తెలియజేసే విధంగా ఈసినిమాలో పాట కూడా ఉంది.

ఏ యువకుడైనా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, రైతులు ఆత్మహత్యలు నివారణ గురించి, మూఢ నమ్మకాల గురించి ఈ సినిమాలో తెలియజేస్తున్నాం. నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాను 76 కోట్లతో నిర్మించారు. నేను చిన్నప్పట్నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. 32 ఇంటర్నేషనల్‌ గేమ్స్‌ గురించి తెలుసు. వాటిని ఆడటంలో కూడా నేను నిష్ణాతుడను. ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇస్తుంటాను. సామాజిక సేవలో భాగంగా డ్రగ్స్‌కు బానిసలుగా మారిన ఆరుకోట్ల మందిని ఆ మహమ్మారి నుండి కాపాడాను. ఇలాంటి వారికి ఉచితంగా చికిత్స చేస్తాం. ఈ సినిమాలో హింస గురించి నేను చెప్పడం లేదు. అయితే శ్రీరాముడు, కృష్ణుడు, విశ్వామిత్రుడు, పరుశురాముడు వంటి దేవతలు, మునులు కూడా అవసరం వచ్చినప్పుడు దుష్టులను సంహరించారు.

ఈ సినిమాలో ఎలియన్స్‌తో జరిపే పోరాటం ఉంటుంది. దాని కోసమే నేను చేసే పోరాటం సినిమాలో ఉంటుంది. నేను ఎం.ఎస్‌.జి సినిమాను విడుదల చేస్తున్నప్పుడు సెన్సార్‌ కార్యక్రమంలో సమస్యలు వచ్చాయి. అయితే సినిమాలో ఎటువంటి తప్పు లేదు. చివరకు అది వారు తెలుసుకున్నారు. సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా విషయంలో కూడా సెన్సార్‌ సమస్యలేవీ ఎదురుకాలేదు. అన్నీ ధర్మాలకు, వేదాలకు సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాను. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. వి.ఎఫ్‌.ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది” అన్నారు.

- Advertisement -