నయనతార నటిస్తున్న మరో హార్రర్ చిత్రానికి ‘డోరా’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ‘మాయ’ వంటి హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నయనతార ఇదే తరహా చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతోంది. తాజాగా ఆమె సంతకం చేసిన ‘డోరా’ కూడా హీరోయిన్ ప్రాధాన్య చిత్రమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
అంతేకాదు, హీరో లేకుండానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ‘డోరా రూపొందుతోందని, ఇందులో రొమాన్స్‌కి చోటు లేదని యూనిట్ సభ్యులు తెలిపారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. త్వరలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభించి ఆగస్టు 20 నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. కాగా, ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ పోలీసు ఆఫీసర్ పాత్రలో, కన్నడ నటుడు సులీల్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు.ఈ హర్రర్ చిత్రంలో దోరా దెయ్యం పేరా? హీరోయిన్ పేరా అన్నది తెలియాల్సి ఉంది.
Nayanatara