టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కేవలం సినిమాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూట్ కూడా చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ సినిమా పడితే ఆ సినిమాను ఆయన డిస్ట్రీబ్యూట్ చేయరు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన దానిపై కాన్ఫిడెంట్‌గా ఉంటేనే రాజు గారు ఆ సినిమా జోలికి వెళతారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ సినిమా నైజాం హక్కుల కోసం దిల్ రాజు చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఈ చిత్ర హక్కులను ఏకంగా రూ. 15 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు.
ఇది పెద్ద రిస్కే అన్నారు చాలామంది. అయితే సినిమా విడుదలైన ఫస్ట్‌డే నుండీ మిక్స్‌డ్ టాక్ రావడంతో రాజుగారికి టెన్షన్ మొదలయ్యింది. పెట్టిన మొత్తం తిరిగి వస్తుందో లేదో కూడా తెలీదు. అయితే ఇలాంటి భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ జనతా గ్యారేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ దూసుకెళుతుంది. ఐతే దిల్ రాజు జడ్జిమెంట్ ఎలా ఉంటుందన్నది ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లే రుజువు చేస్తున్నాయి.
దిల్ రాజు పెట్టుబడి తిరిగి తేవడంతో పాటు రూ.3 కోట్ల లాభం కూడా తెచ్చిపెట్టింది ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా ఇప్పటికే రూ.18 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇప్పటికీ సినిమాకు ఓ మోస్తరుగా కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం దిల్ రాజు మాత్రమే కాకుండా సినిమా డిస్ట్రీబ్యూటర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ దాటేసి ఫుల్ హ్యీపీగా ఉన్నారు.