పెళ్లి ఆగిపోయిన తరువాత హీరోయిన్ త్రిష కెరీర్ ముగిసిందని సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే పెళ్లి డిజాస్టర్ నుండి కోలుకున్న త్రిష తన అందాలతో కుర్ర హీరోయిన్ లకు పోటీ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల హార్రర్ జానర్ లో నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది త్రిష. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. ఈసారి మోహినిగా మరో సినిమాతో మన ముందుకు రాబోతుంది ఈ తమిళ బ్యూటీ. త్రిష ముచ్చటగా మూడోసారి నటిస్తున్న హారర్ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలు వేసే తరహా స్కిన్ టైట్ డ్రెస్ లో తలపై కిరీటం, ఎనిమిది చేతులలో ఆయుధాలు.. చూస్తుంటే.. ఈజిప్ట్ దేవతలా కనిపిస్తోంది.
ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఓ బేకరి షాప్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందట. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్రిష కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కిన కోడి సినిమాలోనూ నటిస్తోంది ఈ బ్యూటి. మరి ఈ సినిమాలైనా త్రిషకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.